
సాక్షి, ముంబై : ఉత్తర్ ప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో అనుమానిత ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. దుబాయ్‌నుంచి భారత్ వచ్చిన అబు జియాద్ అనేవ్యక్తిని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నడన్న అనుమానంతో అరెస్ట్ చేసినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. దుబాయ్ నుంచే ఐఎస్ నెట్‌వర్క్‌ను అబు నిర్వహిస్తున్నాడని.. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని ముస్లిం యువతను రిక్రూట్ చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు.
బిజునూర్‌లోని ఐఎస్ సానుభూతిపరుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో అబు జియాద్ గురించి తెలిసిందని అధికారులు తెలిపారు.