విలీనంతో ఎస్‌బీఐ ఆస్తులకు దన్ను
విలువ రూ. 30 లక్షల కోట్లకు బలమైన ప్రపంచ స్థాయి బ్యాంకుగా అవతరణ
ముంబై : 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనంతో ఎస్‌బీఐ ఆస్తుల విలువ భారీగా పెరగనుంది. మరెన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి.
► విలీనం ద్వారా 120 బిలియన్ డాలర్ల (రూ.8.04లక్షల కోట్ల) మేర ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ విలీనం అనంతరం ఎస్‌బీఐ మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి 447 (సుమారు రూ.30 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లకు చేరుతుంది.
► ఐసీఐసీఐ ఆస్తుల విలువ అప్పుడు ఎస్‌బీఐ విలువలో పావుశాతంగానే ఉంటుంది.
► 24వేల శాఖలతో, 2,70,000 మంది ఉద్యోగులతో, 58వేల ఏటీఎంలతో 50 కోట్ల మందికి సేవలు అందించే బ్యాంకుగా ఎస్‌బీఐ ఎదుగుతుంది.
► విలీనం ద్వారా నిర్వహణ సామర్థ్యాలు మెరుగవడంతోపాటు కొత్త క్లయింట్లను చేరుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవడం సాధ్యపడుతుంది.