పాములే ఫలహారం | Bihar painter who has eaten 4,000 raw SNAKES eyes Guinness | Sakshi
Sakshi News home page

పాములే ఫలహారం

Published Fri, Aug 23 2013 5:23 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

పాములే ఫలహారం - Sakshi

పాములే ఫలహారం

పాట్నా: పాములను వెతికి పట్టుకుని మరీ పరపర నమిలి భోంచేసే ఇతగాడి పేరు నిరంజన్ భాస్కర్. బీహార్‌లోని అరాహ్ జిల్లా వాసి. వృత్తి పెయింటింగ్. ‘పాము నెత్తురు అప్పుడే పితికిన పాల రుచితో ఉంటుంది... పాము లేకుండా నా భోజనం పూర్తి కాదు’ అని చెబుతాడు ఇతడు. రోజూ ఉదయాన్నే గంగానది ఒడ్డుకు వెళ్లి, పుట్టల్లోను, కలుగుల్లోను, రాళ్ల సందుల్లోను నక్కిన పాములను వేటాడటం ఇతడి దినచర్య. ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే తొలిసారిగా పచ్చి పాము మాంసాన్ని రుచి చూసినట్లు నిరంజన్ చెప్పాడు. ‘అది 1977 వర్షాకాలం. వర్షంలో నేను బడికి వెళుతుండగా ఒక పాము నాపై దాడిచేసింది.
 
 తప్పించుకునే మార్గం లేకపోవడంతో నాకు కోపం తారస్థాయికి చేరుకుంది. ఆ పాముని పట్టుకుని కసితీరా కొరికేశాను. అలా కొరుకుతూ కొరుకుతూ మొత్తం తినేశాను’ అని ఆనాటి జ్ఞాపకాన్ని వివరించాడు. అప్పటి నుంచి ఏదోలా రోజుకు ఒక పామునైనా వెతికి పట్టుకుని తినడం అలవాటుగా వస్తోందని చెప్పాడు. ఇప్పటి వరకు నాలుగువేలకు పైగా పాములను తినేశానని, తన ఘనతను గిన్నిస్‌బుక్ గుర్తించాలని అంటున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement