తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీని కోసం ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు.
లక్నో: తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీని కోసం ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. దళితురాలిని కాబట్టే తనను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. విరాళాల ద్వారా సేకరించిన నిధులనే తమ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలో జమ చేశామని చెప్పారు.
తాము డిపాజిట్ చేసిన ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని తెలిపారు. తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. చట్టప్రకారం తన సోదరుడు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేశాడని తెలిపారు. బీజేపీ ఖాతాల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఎదుర్కొనే ధైర్యంలేక బీజేపీ ఇలాంటి కుయుక్తులు చేస్తోందని మాయావతి మండిపడ్డారు.
బీఎస్పీ ఖాతాలో రూ. 104 కోట్లు, మాయావతి సోదరుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాలో రూ.కోటి నలభై మూడు లక్షల నగదు డిపాజిట్ అయినట్టు ఈడీ అధికారులు సోమవారం గుర్తించారు.