
ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రాలేదు
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీలపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తప్పుపడుతూ.. ఎన్నికల్లో మోదీ దీని ఫలితాలను అనుభవిస్తారని విమర్శించారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీలను, పెద్ద నోట్ల రద్దు గురించి ప్రజలు ఆ పార్టీని ప్రశ్నిస్తారని మాయావతి అన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రాలేదని జోస‍్యం చెప్పారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ.. ఈ రోజు ఉదయం ఇదే రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లకపోవడాన్ని తప్పుపట్టారు.