జమ్మూలోని రాజ్భన్లో జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలసిన బీజేపీ నేతలు
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మర యత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీతో చేతులు కలిపేందుకు తాము విముఖంకాదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బుధవారం సూచనప్రాయంగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి బృందం గురువారం జమ్మూలో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలుసుకుంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీలతో చర్చించేందుకు తమకు మరింత గడువు కావాలని ఆ బృందం గవర్నర్‌ను కోరింది.
జమ్మూ కశ్మీర్‌లో ఏ పార్టీకి గానీ, కూటమికి గానీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 87 శాసనసభ స్థానాలలో 28 సీట్లతో పీడీపీ అతిపెద్దపార్టీగా అవతరించింది. 25 సీట్లతో బీజేపీ రెండో స్థానంలో ఉంది.
అయితే ఈ రెండు పార్టీలు ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలాన్ని సాధించలేక పోయాయి.