జార్ఖండ్లో 9 చోట్ల బీజేపీ విజయం | bjp wins in 9 constituencies of jharkhand | Sakshi
Sakshi News home page

జార్ఖండ్లో 9 చోట్ల బీజేపీ విజయం

Published Tue, Dec 23 2014 2:17 PM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

జార్ఖండ్లో 9 చోట్ల బీజేపీ విజయం - Sakshi

జార్ఖండ్లో 9 చోట్ల బీజేపీ విజయం

జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 9 చోట్ల గెలిచి 33 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక జేఎంఎం 7 చోట్ల గెలిచి 10 చోట్ల ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క స్థానంలోనూ విజయం రుచిచూడలేదు గానీ, 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేవీఎం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.

ఆ పార్టీ కేవలం 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో గెలిచి 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా కనీసం 41 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. దాంతో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement