
మధుకోడా ఓడిపోయారు!!
జార్ఖండ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మఝ్గనాన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బర్కువార్ గగ్రాయ్ చేతిలో ఆయన ఓడిపోయారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మధుకోడా మీద తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి.. చావుదెబ్బ తిన్నట్లయింది.