
సీఎం గెలుపు.. మాజీ సీఎం ఓటమి
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరోసారి విజయం సాధించారు. హేమంత్ తన సమీప బీజేపీ అభ్యర్థి హేమ్ లాల్ ముర్ముపై ఇరవై మూడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. భర్ హైత్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన హేమ్ లాల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి విజయం సాధించారు. అయితే హేమ్ లాల్ పోటీ చేసిన మరో నియోజకవర్గం దుమ్కాలో ఓటమి పాలైయ్యారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం, జై భారత్ సమంత పార్టీ అభ్యర్థి మధు కోడా ఓటమి పాలైయ్యారు.
మజ్హాగో నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మధు కోడా జేఎంఎం అభ్యర్థి నియాల్ పుర్టిపై ఇరవై వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే జగన్నాథ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధు కోడా భార్య గీతా కోడా ఆధిక్యంగా దిశగా సాగుతున్నారు.