
నదిలో పడ్డ బొలేరో, తప్పిన ప్రమాదం
ఉత్తరాఖండ్: రయ్యరయ్యమంటూ దూసుకెళ్తున్న ఓ బొలేరో వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ లో నాచాని ప్రాంతానికి సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. బొలేరో వాహనంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. నది తీరప్రాంతం కొండల పైనుంచి దూసుకెళ్తున్న బొలేరో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి నదిలోకి జారి పడిపోయింది.
సమాచారం అందుకున్న రిస్య్కూ టీం ఘటనా స్థలికి చేరుకుని ఆ వాహనాన్ని బయటకు లాగింది. అయితే అదృష్టవశాత్తూ వాహనంలో ఉన్నవారంతా ప్రాణాలతో బయటపడ్డారు.