
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : ఆన్‌లైన్ కాస్లులు అనేవి ఓ గొప్ప ప్రగతిశీల చర్యగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ క్లాసులు వ్యతిరేకించడం జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమేనని తెలిపింది. మనం 21వ శతాబ్దంలో ఉన్నామని.. ప్రపంచం డిజిటల్ యుగం కొనసాగుతోందని పేర్కొంది. డిజిటల్, వర్చువల్ లెర్నింగ్‌ను అందరూ ప్రొత్సహించాలని కోరింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని తెలిపింది.(చదవండి : బీమా సంస్థల విలీనం వాయిదా)
ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణలో ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేయాలని సూచించింది. ఈ-లెర్నింగ్ కోసం మరింత మెరుగైన ఎస్‌వోపీ అమలు చేయాలని తెలిపింది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment