
మోతిహరి, బిహార్ : బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 27 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన బిహార్‌లోని మోతిహరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు... ఢిల్లీ నుంచి ముజఫర్‌పూర్ వెళ్తున్న బస్సు కోట్వా ప్రాంతంలోని మొగా హోటల్ సమీపంలో మలుపు తిరుగుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని, బయటకు రావడం వీలుకాక పోవడంతో 27 మంది ప్రయాణికులు బస్సులోనే మంటలకు ఆహుతయ్యారు.
ప్రమాదం సమయంలో బస్సులో డ్రైవర్‌తో కలుపుకుని మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాలు పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment