
అక్కడ తిన్నా.. ఉన్నా.. కార్డు గీకాల్సిందే!
నల్లధనాన్ని అరికట్టేందుకు నగదు లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 5 స్టార్ హోటళ్లలో ఉన్నా.. అక్కడ తిన్నా.. బిల్లులను కార్డు ద్వారానే చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసేందుకు సిద్ధమైంది.
బిల్లు 5 వేల రూపాయలు దాటిన ఏ లావాదేవీకైనా తప్పనిసరిగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి విలేకరుల సమావేశంలో తెలిపారు. వీలైనంత వరకు నగదు లావాదేవీలను తగ్గించడం ద్వారా నల్లధనానికి ముకుతాడు వేయాలని కేంద్రం యోచిస్తోంది.