card payments
-
ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
దేశంలో ఆన్లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్డు, డిజిటల్ చెల్లింపులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశంలో 2016లో పెద్దనోట్లు రద్దు చేసిన అనంతరం వచ్చిన మార్పుల్లో భాగంగా కార్డు చెల్లింపులు, డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఏకంగా రోజుకు సగటున 800 ఆన్లైన్ ఆర్థిక మోసాల కేసులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. సుమారు రూ.2,110 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్లు తెలిపింది. – సాక్షి, అమరావతిఅధిక మోసాలు ఈ రూపాల్లోనే» బ్యాంకు ఖాతాదారులు సైబర్ ముఠాల మాటలు నమ్మి తమ ఓటీపీ, ఇతర వివరాలను వారికి తెలియజేయడం వల్లే అధికంగా ఆరి్థక మోసాలు జరుగుతున్నాయి.» ఖాతాదారులు బోగస్ ఈ–కామర్స్ సైట్లకు నిధులు బదిలీ చేయడం ద్వారా పాల్పడుతున్న మోసాలు రెండో స్థానంలో ఉన్నాయి. » బ్యాంకు ఖాతాలను హ్యాకింగ్/బ్రీచ్ ద్వారా పాల్పడుతున్న నేరాలు మూడో స్థానంలో ఉన్నాయి.» బ్యాంకు ఖాతాదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆధార్, పాన్ కార్డ్, ఓటీపీ వివరాలను ఇతరులకు తెలియజేయకూడదని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. తమ వివరాలను ఇతరులకు వెల్లడించడం ద్వారాగానీ, అనధికారిక లావాదేవీలతో సంభవించే ఆరి్థక మోసాలకు బ్యాంకులు బాధ్యత వహించవని, దీనిపై 2017లోనే నిబంధనలు రూపొందించామని గుర్తుచేసింది.ఆర్బీఐ నివేదికలోని ప్రధాన అంశాలు»2023–24లో దేశంలో 2.90 లక్షల ఆన్లైన్ ఆర్థిక నేరాల కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 800 కేసులు నమోదు కావడం గమనార్హం. » రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082 నమోదయ్యాయి. మిగిలిన కేసులతో కలిపి 2023–24లో మొత్తంమీద 2.90లక్షల ఆన్లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. » 2016 తర్వాత ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. » ఆన్లైన్ ఆర్థిక మోసాల ద్వారా సైబర్ నేరాల ముఠాలు భారీస్థాయిలో మోసాలకు పాల్పడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.2,110 కోట్లు కొల్లగొట్టాయి. వాటిలో రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న కేసుల్లో మొత్తం రూ.1,457 కోట్లు స్వాహా చేశారు. రూ.లక్ష కంటే తక్కువ కొల్లగొట్టిన కేసుల్లో మొత్తం రూ.653 కోట్లు దోచుకున్నారు.2023–24 లో దేశంలో ఆన్లైన్ ఆర్థిక నేరాలు ఇలా..» మొత్తం కేసులు 2.90 లక్షలు» రోజుకు నమోదైన సగటు కేసులు 800» రూ.లక్షకు పైగా కొల్లగొట్టిన కేసులు 29,082» మొత్తం స్వాహా చేసిన మొత్తం రూ. 2,110 కోట్లు -
వీసాపై ఆర్బీఐ ఆంక్షలు!
ముంబై: కార్డు చెల్లింపులను స్వీకరించని సంస్థలకు మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరపడాన్ని నిలిపివేయాలంటూ కార్డు నెట్వర్క్ సంస్థ వీసాను ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇలాంటి లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు చట్టవిరుద్ధంగా బదిలీ అవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘కార్డు ద్వారా చెల్లింపులను స్వీకరించని సంస్థలకు నిర్ధిష్ట మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరిగేలా ఒక కార్డ్ నెట్వర్క్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది‘ అంటూ వీసా పేరును ప్రస్తావించకుండా రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంపై చేపట్టిన అధ్యయనం పూర్తయ్యే వరకు అటువంటి ఒప్పందాలను నిలిపివేయాలని కార్డు కంపెనీకి సూచించినట్లు వివరించింది. అయితే, క్రెడిట్ కార్డుల సాధారణ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. ఆర్బీఐ ప్రత్యేకంగా పేరు ప్రస్తావించనప్పటికీ సదరు కార్డు నెట్వర్క్ సంస్థ వీసానే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఇది కూడా ఒక తరహా చెల్లింపు విధానం కిందకే వస్తుందని, అధికారికంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. -
కార్డుల ద్వారా ఆ పేమెంట్లు వద్దు.. ఆర్బీఐ షాకింగ్ ఆదేశాలు
కార్డుల ద్వారా కంపెనీలు చేసే వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) పేమెంట్ టెక్నాలజీ సంస్థలైన మాస్టర్ కార్డ్ ( Mastercard ), వీసా ( Visa ) లను కోరింది. ఫిబ్రవరి 8న జారీ చేసిన లేఖ ప్రకారం.. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ( BPSP ) లావాదేవీలను నిలిపివేయాలని ఈ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. వాణిజ్య, వ్యాపార చెల్లింపులలో బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై పరిశ్రమ నుంచి సమాచారం కోరుతూ ఫిబ్రవరి 8న ఆర్బీఐ నుంచి ఒక కమ్యూనికేషన్ అందినట్లు వీసా ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. అన్ని బీపీఎస్పీ లావాదేవీలను నిలిపివేయాలన్న ఆదేశాలు ఆర్బీఐ నుంచి వచ్చిన ఆ కమ్యూనికేషన్లో ఉన్నట్లు వీసా పేర్కొంది. పీఏ పీజీ (పేమెంట్ అగ్రిగేటర్/పేమెంట్ గేట్‌వే) మార్గదర్శకాల ప్రకారం బీపీఎస్పీలు ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయని, వాటికి సెంట్రల్ బ్యాంకే లైసెన్సులు జారీ చేస్తుందని వీసా తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐతోపాటు వ్యవస్థలోని భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తున్నట్లు కార్డ్ పేమెంట్ సంస్థ పేర్కొంది. కాగా కార్పొరేట్ కార్డ్-టు-బిజినెస్ అకౌంట్ నగదు బదిలీ లావాదేవీల విషయంలో అనుసరించాల్సిన వ్యాపార నమూనాకు సంబంధించి కొంతమంది బ్యాంకర్లతో సహా మాస్టర్ కార్డ్, వీసా సంస్థలు ఫిబ్రవరి 14న ఆర్బీఐని సంప్రదించి స్పష్టత ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. కంపెనీలు సాధారణంగా నెట్ బ్యాంకింగ్ లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. కానీ ఎన్కాష్, కార్బన్, పేమేట్ వంటి కొన్ని ఫిన్‌టెక్‌లు మాత్రం సప్లయర్స్, వెండర్లకు కార్డ్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నాయి. అటువంటి చెల్లింపుల మొత్తం నెలవారీ లావాదేవీ పరిమాణం రూ. 20,000 కోట్లకు మించి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాల విషయమై ఎన్కాష్, మాస్టర్‌కార్డ్ సంస్థలు స్పందించలేదు. సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేమేట్ వెల్లడించింది. ఈ చర్యలకు గల కారణాన్ని ఆర్బీఐ వెల్లడించనప్పటికీ, నాన్ కేవైసీ వ్యాపారులకు కార్డుల ద్వారా అధిక మొత్తంలో నగదు ప్రవాహం కేంద్ర బ్యాంక్‌కు చికాకు కలిగించి ఉండొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. -
Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్!
New credit debit card rules for online payments from January 1, 2022 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బిగ్‌బాస్కెట్.. మీకిష్టమైన ఆన్లైన్ వెబ్సైట్లలో షాపింగ్ సులభతరం కానుంది. అవును.. జనవరి 1, 2022 నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా మీ చెల్లింపులు సులభతరం కావడమేకాకుండా, మీలావాదేవీల సమాచారం కూడా మరింత భద్రంగా ఉంటుంది. డిజిటల్ చెల్లింపుల కోసం ఇకపై 16-అంకెల కార్డ్ వివరాలను, కార్డ్ గడువు తేదీని గుర్తుంచుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. 'టోకనైజేషన్' అనే కొత్త పద్ధతి ద్వారా త్వరగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు. టోకనైజేషన్ అంటే ఏమిటి? కొత్త చెల్లింపు పద్ధతి ఎలా ఉండబోతోంది? టోకనైజేషన్ అనేది క్లయింట్లు టోకెన్ ద్వారా కార్డు సమాచారాన్ని వినిమయించుకోవడం ద్వారా వ్యక్తిగత సమాచారంతో సంబంధంలేకుండా కొనుగోళ్లు సజావుగా సాగే విధానం. ఈ కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్ కోసం సీవీవీ నంబర్ ఇకపై అవసరం లేదు. టోకనైజ్డ్ కార్డ్‌లను ఎలా ఉపయోగించాలి? ►టోకనైజేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేయవచ్చు. అయితే దేశీయ కార్డులు మాత్రమే ప్రస్తుత నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ కార్డ్‌లకు టోకనైజేషన్ వర్తించదు. ►వినియోగదారులు ప్రొడక్ట్స్‌ను కొనుగోలుచేసే సమయంలో షాపింగ్ వెబ్‌సైట్‌కు చెందిన చెక్-అవుట్ పేజీలో కార్డు వివరాలను ఖచ్చితంగా నమోదు చెయ్యాలి. అలాగే టోకనైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్లో ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ కార్డు సమాచారాన్ని తప్పక సమర్పించాలి. తర్వాత టోకనైజేషన్‌ని ఎంచుకోవాలి. చెల్లింపుల సమయంలో ఇన్‌పుట్‌ని నిర్ధారించడానికి టోకెన్లు సహాయపడతాయి. ►ఈ పద్ధతి ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే.. హ్యాకర్ టోకెన్ నుండి కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం అంత సులభమేమీకాదు. చదవండి: Covid Alert: 70 రెట్లు వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్! నిపుణుల హెచ్చరికలు.. -
‘పే’యాప్‌ల జోరు.. ఏటీఎం, క్రెడిక్ కార్డుల బేజారు
న్యూఢిల్లీ: మొబైల్ చెల్లింపులు దేశంలో శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వేగం కార్డు చెల్లింపుల కంటే ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి రాక తర్వాత చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు డిజిటల్ చెల్లింపులను (యూపీఐ/క్యూఆర్‌కోడ్) ఆమోదిస్తుండడం ఈ వృద్ధికి దోహదపడుతున్నట్టు ‘ఇండియా మొబైల్ పేమెంట్స్ మార్కెట్ 2021’ నివేదిక తెలిపింది. 67 శాతం వృద్ధి మొబైల్ యాప్స్ ద్వారా చేసే చెల్లింపుల విలువ 2020లో 67 శాతం పెరిగి 478 బిలియన్ డాలర్లుగా ఉంటే.. 2021లో ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ‘‘భారత్‌లో మొబైల్ ఫోన్ల ద్వారా చేసే చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. యాప్‌ద్వారా చెల్లింపులు ఆదరణ పొందడం ఇందుకు తోడ్పడుతోంది’’ అని ఈ నివేదికను విడుదల చేసిన ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ పరిశోధన బృందం తెలిపింది. స్మార్ట్ ఫోన్లతో చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నందున కార్డు చెల్లింపులకు కంటే ఇవే ఎక్కువగా వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. తగ్గుముఖం డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ లావాదేవీల విలువ 2020లో 14 శాతం తగ్గి 170 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నివేదిక అంచనా మేరకు.. 2020లో బ్యాంకులు 524 మిలియన్ డాలర్ల మేర క్రెడిట్ కార్డుల ఇంటర్చేంజ్ ఆదాయాన్ని కోల్పోయాయి. లాక్డౌన్లతో కార్డు చెల్లింపులు తగ్గిపోవడం తెలిసిందే. అనుకూలమైన ఎంపిక.. ‘‘చెల్లింపుల యాప్‌ల ద్వారా లావాదేవీలు (పీర్ టు పీర్ సహా), మొబైల్ చెల్లింపులు.. రిటైల్ ఇన్వెస్టర్లకు పాయింట్ ఆఫ్ సేల్, ఆన్లైన్ మాధ్యమాలకు అనుకూలమైన ఎంపికగా మారుతోంది. మొబైల్ చెల్లింపులు ప్రాచుర్యం కావడంతో నగదు వినియోగానికి డిమాండ్ నిదానించింది. 2020లో ప్రతీ ఏటీఎం నగదు ఉపసంహరణతో పోల్చి చూస్తే 3.7 మొబైల్ లావాదేవీలు నమోదయ్యాయి. రానున్న సంవత్సరాల్లోనూ భారత్‌లో డిజిటల్ చెల్లింపులు శరవేగంగా విస్తరించే అవకాశాలే ఉన్నాయి’’ ఈ నివేదిక పేర్కొంది. ఇన్స్టంట్ చెల్లింపుల విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోల్చి చూస్తే.. 2020లో భారత్‌లోనే అధిక సంఖ్యలో రియల్‌టైమ్ లావాదేవీలు నమోదైనట్టు తెలిపింది. ఎంతకాలం ఈ అగ్రస్థానం ‘‘ఫోన్‌పే, గూగుల్‌పే అత్యంత ప్రాచుర్యమైన యూపీఐ చెల్లింపులు యాప్‌లుగా భారత్‌లో అగ్రస్థానాల్లో ఉన్నాయి. 2021లో మొదటి ఆరు నెలల్లో ఫోన్‌పే 44 శాతం మార్కెట్ వాటాతో ఉండగా, గూగుల్ పే 35 శాతం వాటా కలిగి ఉంది. ఈ రెండు యాప్‌లు కలసి 338 బిలియన్ డాలర్ల విలువైన 12 బిలియన్ల లావాదేవీలు నిర్వహించాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. పేటీఎం, అమెజాన్ పే సంస్థలు పోటీలో వెనుకబడినట్టు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 14 శాతమే కాగా, అమెజాన్ పే 2 శాతం వాటాను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అయితే ఫోన్‌పే, గూగుల్ పే యూపీఐ చెల్లింపుల్లో ఎప్పటికీ ఆధిపత్యం కొనసాగించే అవకాశం లేదని గుర్తు చేసింది. ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ యూపీఐ లావాదేవీల్లో 30 శాతం పరిమితి (మొత్తం లావాదేవీల్లో) విధించింది. ఫోన్‌పే, గూగుల్‌పే మాత్రమే ఈ పరిమితిని దాటేశాయి. ఈ నిబంధనల అమలుకు 2022 వరకు సమయం ఉంది’ అని నివేదిక వివరించింది. చదవండి: పేటీఎమ్ మెగా ఐపీవో రెడీ -
గుడ్ న్యూస్, మరింత సులభతరం కానున్న లావాదేవీలు
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. సైబర్ నేరాల నుంచి వినియోగదారుల నుంచి రక్షించేందుకు ఆర్బీఐ, కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. 2022,జనవరి నెల నుంచి ఆన్లైన్ చెల్లింపుల్లో భారీ మార్పులు చేస్తూ టోకెనైజేషన్ వ్యవస్థను అమలులోకి తీసుకు రాన్నట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రానున్న కాలంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం కానున్నాయి. ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో కావాల్సిన ప్రాడక్ట్స్ ఆర్డర్ పెట్టాలంటే తప్పని సరిగా కార్డ్ డీటెయిల్స్ తో పాటు వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే త్వరలో అమలు కానున్న కొత్త పద్దతుల్లో వ్యక్తిగత సమాచారం సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సురక్షితంగా ఉండేలా కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం క్యూఆర్ కోడ్ చెల్లింపులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ (రిటైల్ స్టోర్లలో కార్డ్ లావాదేవీలను నిర్వహించడానికి ఉపయోగించే హార్డ్‌వేర్) లావాదేవీలను నిర్వహించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. టోకెనైజేషన్ వ్యవస్థ పనితీరు ► ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు నిర్వహించే సమయంలో మీ కార్డ్ వివరాలు ఎంటర్ చేసినప్పుడు..ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే..కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది ► వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీ) గా పనిచేస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు టోకెన్లను అందించడం లేదా ఏదైనా మొబైల్ చెల్లింపులకు బాధ్యత వహిస్తాయి. ► టోకెన్‌తో కార్డ్ నంబర్, సీవీవీ వివరాల్ని షేర్ చేసే అవసరం ఉండదు. ► టోకెనైజేషన్‌తో అన్ని ప్లాట్‌ఫాంలలో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ► ఈ ప్రక్రియ లావాదేవీ ప్రారంభించిన ప్రతిసారి యూజర్ల డేటాను షేర్ చేసే అవసరం ఉండదు. ఆన్లైన్ చెల్లింపులు స్పీడుగా చేసుకోవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టోకనైజేషన్ వ్యవస్థ సులభతరం అయినప్పటికీ దాని అమలు, భద్రత ఎంతవరకు అనేది అమల్లోకి వచ్చిన తర్వాత తెలియాల్సి ఉంటుంది. చదవండి: క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే.. -
కార్డు చెల్లింపులపై అదనపు వడ్డన!
నగదురహిత వ్యవస్థ దిశగా దేశాన్ని తీసుకెళ్లాలని పెద్దనోట్లు రద్దుచేసి, స్వైపింగ్ మిషన్ల సంఖ్య పెంచుతున్నా.. సామాన్యులకు మాత్రం దాని ఫలితాలు సరిగా అందడం లేదు. ఆన్లైన్ సర్వర్ల మీద భారం ఒక్కసారిగా పెరిగిపోవడంతో లావాదేవీలు అన్నీ నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిసార్లు చివరివరకు వెళ్లి పేమెంట్ జరగకపోవడంతో వినియోగదారులకు చికాకు వస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. స్వైపింగ్ మిషన్ల సాయంతో కార్డు ద్వారా చెల్లింపులు చేయాలంటే పెద్ద తలనొప్పిగా ఉంది. కనీసం 250 రూపాయలకు కొనుగోలు చేస్తేనే కార్డు చెల్లింపులు తీసుకుంటామని చెప్పడమే కాక, వాటికి అదనంగా 2 శాతం సర్వీసు చార్జి వసూలు చేస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ చార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా, చాలావరకు దుకాణాల వాళ్లు మాత్రం అదనంగా 2 శాతం ఇస్తేనే కార్డు చెల్లింపు తీసుకుంటామని తెగేసి చెబుతున్నారు. కార్డు ద్వారా లావాదేవీలు చేయాలంటే కార్డును రెండు లేదా మూడుసార్లు స్వైప్ చేయాల్సి వస్తోందని, నవంబర్ మధ్య నుంచే ఈ సమస్య వచ్చిందని ఢిల్లీ సదర్ బజార్‌లోని ఓ హోల్‌సేల్ దుకాణ యజమాని నవీన్ కుమార్ చెప్పారు. ఈయన వ్యాపారం ఎక్కువగా నగదు ఆధారంగానే జరుగుతుంది గానీ, ఇప్పుడు నగదు ఎక్కువ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన రూ. 23వేలు ఖర్చుపెట్టి స్వైపింగ్ మిషన్ కొన్నాడు. కానీ అది తరచు మొరాయిస్తోందని, రెస్పాండ్ కావడానికి ఎక్కువ సమయం పడుతోందని వాపోతున్నాడు. ఈమధ్య కాలంలోనే ఎక్కువ మంది స్వైపింగ్ మిషన్లు కొనడంతో ఒక్కసారిగా వాటి సర్వర్ల మీద భారం పెరిగి ఇలా అవుతోందని, తాము ఇంతకుముందు కూడా కార్డులు తీసుకునేవాళ్లమని.. అప్పుడు అలా లేదని పెట్రోలుబంకులో పనిచేసే మనోజ్ యాదవ్ చెప్పారు. ఇప్పటివరకు ఎప్పుడూ తమ మిషన్లు హ్యాంగ్ అవడం గానీ, స్లో అవ్వడం గానీ లేదని.. కానీ ఇప్పుడు మాత్రం కార్డులను ఒకటికి మూడు నాలుగు సార్లు స్వైప్ చేస్తే తప్ప పని అవ్వడం లేదని చెప్పాడు. తాను దక్షిణ ఢిల్లీలోని ఒక సెలూన్లో కటింగ్ చేయించుకున్నానని, అక్కడ మామూలుగా అయితే 70 రూపాయలే తీసుకుంటారు గానీ, తాను కార్డుతో చెల్లిస్తానంటే 90 రూపాయలు ఇవ్వాలన్నారని సిద్దార్థ అరోరా అనే పిల్లల వైద్యుడు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ చార్జీలు రద్దుచేసిందని చెప్పి, వాళ్లకు పూర్తిగా వివరించిన తర్వాత.. ఎట్టకేలకు 70 రూపాయలు తీసుకోడానికి అంగీకరించారన్నారు. -
కార్డు స్వైప్ లేకుండానే చెల్లింపులు!
రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దుతో పేటీఎం వంటి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వ్యాపారుల కోసం పేటీఎం తన యాప్‌ను అప్డేట్ చేసింది. స్వైప్ లేదా పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్లతోనే ఇన్నిరోజులు జరిగిన దుకాణాల లావాదేవీలు ఇక నుంచి తమ పేటీఎం యాప్ ద్వారా కూడా చేసేవిధంగా వీలు కల్పించింది. ఈ మిషన్ల అవసరం లేకుండా తమ లేటెస్ట్ పేటీఎం యాప్ వెర్షన్‌తో దుకాణదారులు కార్డు పేమెంట్లను అంగీకరించవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం ఆండ్రాయిడ్ యాప్‌లోని తాజా అప్డేట్ చిన్న వర్తకులకు ఎంతో సహకరిస్తుందన్నారు. యూజర్ల దగ్గర పేటీఎం అకౌంట్ లేనిసమయంలో, దుకాణదారులు వారివద్ద నున్న పేటీఎం యాప్ ద్వారా బిల్లును జనరేట్ చేయడానికి మీ కార్డు వివరాలు, ఫోన్ నంబర్ నమోదు చేయనున్నారు. ఆ సమయంలో యూజర్ల మొబైల్‌కు ఓ ఓటీపీ(ఒన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. దుకాణ దారుడి ఫోన్లో ఆ ఓటీపీ నమోదుచేయగానే, తమ బిల్లు చెల్లింపు జరిగిపోతోంది. తాజా అప్డేట్ ద్వారా చిన్న దుకాణాదారులకు.. ఇటు చిల్లర దొరక్క ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు మేలు జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో కేవలం 14 లక్షల మెషిన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ ఉంటే, దేనినైనా మార్చే విధంగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రోజుకు 70 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపారు. దీంతో తాము 5 బిలియన్ డాలర్ల విలువైన జీఎంవీ అమ్మకాల లక్ష్యాన్ని నాలుగు నెలల ముందే సాధించామని ఆనందం వ్యక్తంచేశారు. పెద్ద నోట్ల రద్దు హఠాత్తు నిర్ణయంపై ప్రతిపక్షం కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంపెనీకి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లను ఆయన తోసిపుచ్చారు. ఇదంతా అనవసర రాద్ధాంతమని, ఈ కష్టం భవివ్యత్తులో భారీ మొత్తంలో లబ్దిచేకూరుస్తుందని శర్మ చెప్పారు. -
అక్కడ తిన్నా.. ఉన్నా.. కార్డు గీకాల్సిందే!
నల్లధనాన్ని అరికట్టేందుకు నగదు లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 5 స్టార్ హోటళ్లలో ఉన్నా.. అక్కడ తిన్నా.. బిల్లులను కార్డు ద్వారానే చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసేందుకు సిద్ధమైంది. బిల్లు 5 వేల రూపాయలు దాటిన ఏ లావాదేవీకైనా తప్పనిసరిగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి విలేకరుల సమావేశంలో తెలిపారు. వీలైనంత వరకు నగదు లావాదేవీలను తగ్గించడం ద్వారా నల్లధనానికి ముకుతాడు వేయాలని కేంద్రం యోచిస్తోంది.