కేజ్రీవాల్ కు షాక్
న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నరేంద్ర మోదీ సర్కారు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రాజేంద్ర కుమార్ ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో రాజేంద్ర కుమార్ తో పాటు మరో నలుగురిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రాజేంద్ర కుమార్ పై అవినీతి ఆరోపణలు రావడంతో గతేడాది ఢిల్లీ సెక్రటేరియట్ లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. తమ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు ఢిల్లీ సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ తీసుకెళ్లడంపై అప్పట్లో కేజ్రీవాల్ తప్పుబట్టారు. కక్ష సాధింపులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇదంతా చేయించారని ఆరోపించారు. రాజేంద్ర కుమార్ ఎటువంటి తప్పు చేయలేదని వెనుకేసువచ్చారు.
రాజేంద్ర కుమార్ అరెస్ట్ పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయికి దిగజారిపోవడం తాను చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.