అగస్టా, మాల్యా కేసుల విచారణకు సిట్
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్‌లాండ్, విజయ్‌మాల్యా వంటి కొన్ని హైప్రొఫైల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సీబీఐ బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను నియమించింది. ఈ బాధ్యతలను గుజరాత్ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాకు అప్పగించింది. 2002లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ దగ్ధం కేసు విచారణకు రాకేశ్ సారథ్యం వహించడం తెలిసిందే.