మాజీ సీఎంకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: శాసనసభలో బల నిరూపణకు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను సోమవారం విచారించనుంది.
తనకు లంచం ఇవ్వడానికి బేరసారాలు సాగిస్తున్నవీడియోను రెబెల్ ఎమ్మెల్యే బయటపెట్టారు. లంచం ఆరోపణలను రావత్ ఖండించారు. ఈ వీడియో ప్రామాణికతను నిర్ధారించడానికి దాన్ని కేంద్ర హోంశాఖ చండీగఢ్ లోని ఫోరెన్పిక్ సైన్స్ లేబొరేటరీకి పంపింది. వీడియో నిజమైనదేనని విచారణలో తేలడంతో రావత్ ను సోమవారం ప్రశ్నించేందుకు సీబీఐ సమన్లు జారీ చేసింది. గత నెల27 న ఉత్తరాఖండ్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఇప్పటివరకు అక్కడ ప్రభుత్వం లేదు. రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.