ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మహమ్మారిని అరికట్టేందుకు ఇప్పటి వరకు మందు అందుబాటులోకి రాకపోవడంతో అనేక దేశాలు వైరస్ ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కరోనాకు.. ఇప్పటి వరకు దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, అలసట, గొంతునొప్పి, కళ్లు ఎర్రబడటం, విరేచనాలు వంటివి ప్రధాన లక్షణాలుగా ఉన్న విషయం తెలిసిందే. రానురాను వీటిలో కొత్త లక్షణాలు కూడా చేరుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాల జాబితాలో మరికొన్ని లక్షణాలను కేంద్రం చేర్చింది. అకస్మికంగా రుచిని, వాసనను కోల్పోవడం కూడా కరోనా లక్షణాల కింద పేర్కొంది. ‘క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్: కోవిడ్-19’ పేరుతో శనివారం విడుదల చేసిన డాక్యుమెంట్‌లో కేంద్రం ఈ రెండింటిని కరోనా లక్షణాలుగా పేర్కొంది. అలాగే వీటిని వైద్య నిపుణులకు సందేహ నివృత్తి కోసం అందిచనుంది. (ఇరాన్‌లో మళ్లీ కఠిన నిబంధనలు )
కాగా ఈ డాక్యుమెంటరీలో ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఎలా సోకుతుందనే విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యక్తితో సన్నిహితంగా మెలగడం ద్వారా, అంటే కరోనా వ్యక్తి దగ్గిన, తుమ్మిన లేదా మాట్లాడేటప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉందని పేర్కొంది. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా అతడి ముక్కు, నోటి నుంచి పడే తుంపర్లు ఏదైనా ప్రదేశంపై పడితే, ఆ ప్రదేశాన్ని ఎవరైనా తాకి, ఆ చేతిని కళ్లు, ముక్కు, నోటి వద్ద ముట్టుకున్నా కరోనా సోకుతుందని వివరించింది. (కరోనా: రేపు అమిత్ షాతో కేజ్రీవాల్ భేటీ )
ఇక ఇటీవల అలాగే ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 60 ఏళ్లు పైబడిన వారు గా కరోనావైరస్ బారిన పడుతున్నారని, డయాబెటిస్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా కరోనాతో అధిక ప్రమాదం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కరోనాకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం వల్ల కొన్ని పరిశోధనాత్మక చికిత్సలను అన్వేషిస్తున్నట్లు కేంద్ర తెలిపింది. (దివ్య హత్య కేసు: కృష్ణ అకౌంట్‌లో డబ్బులు!)
Comments
Please login to add a commentAdd a comment