
న్యూఢిల్లీ : ఎన్–95 మాస్క్‌లు, ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వ్‌లున్న ఎన్–95 మాస్క్‌ల వినియోగంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి మాస్క్‌లు వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని, కరోనాను నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. వైద్యసిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్క్‌లను అనుచిత రీతిలో సామాన్య ప్రజలు వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని ఆ లేఖలో ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌లను వినియోగించేందుకు మార్గదర్శకాలు ఆరోగ్య శాఖ వెబ్‌సైట్లో ఉన్నాయని, వాటిని ప్రచారం చేయాలని సూచించింది. (ఆక్స్‌ఫర్డ్ టీకా భద్రమే..!)