చంద్రబాబు నిరాహార దీక్ష భగ్నం | chandra babu naidu hunger strike disrupted | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిరాహార దీక్ష భగ్నం

Published Fri, Oct 11 2013 3:09 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

చంద్రబాబు నిరాహార దీక్ష భగ్నం - Sakshi

చంద్రబాబు నిరాహార దీక్ష భగ్నం

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చేపట్టిన నిరాహార  దీక్షను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు భగ్నం చేశారు. దీక్షను భగ్నం చేసే క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే యత్నం చేశారు.  చంద్రబాబు దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించవద్దని కార్యకర్తలు అంబులెన్స్ ను సైతం అడ్డుకోవడంతో ఏపీ భవన్ ప్రాంగణంలో పరస్థితి ఉద్రిక్తంగా మారింది.  దీంతో లాఠీకి పని చెప్పిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి ఎట్టకేలకు చంద్రబాబును రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి  తరలించారు.
 
 

అందరినీ సంప్రదించి రాష్ట్రాన్ని విభజించాలంటూ ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి చంద్రబాబు నిరాహార దీక్షకు దిగారు. చంద్రబాబు దీక్షకు దిగి ఐదు రోజులు కావడంతో ఆయన ఆరోగ్యం మందగించింది. దీంతో ఆయన  దీక్షను భగ్నం చేయక తప్పలేదు.  ఇప్పటివరకూ రోజూ రెండుసార్లు చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి వివరాలు మాత్రం వెల్లడించలేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement