చంద్రబాబుకు.. రోజురోజుకూ పెరిగిన చక్కెర స్థాయి! | Chandrababu Naidu's Sugar levels increase despite fasting | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు.. రోజురోజుకూ పెరిగిన చక్కెర స్థాయి!

Published Sat, Oct 12 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

చంద్రబాబుకు.. రోజురోజుకూ పెరిగిన చక్కెర స్థాయి!

చంద్రబాబుకు.. రోజురోజుకూ పెరిగిన చక్కెర స్థాయి!

విస్తుగొలిపిన బాబు ఆరోగ్యం
 సాక్షి, న్యూఢిల్లీ: నాలుగురోజులు నిరవధిక దీక్ష చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య వివరాలను అటు వైద్యులు కానీ, ఇటు పార్టీవారు కానీ పూర్తిగా బయటకు చెప్పకపోవడడం అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రికి తరలించాలంటూ జేడీ (హాస్పిటల్స్), డీసీపీ (న్యూఢిల్లీ), రెసిడెంట్ కమిషనర్ (ఏపీభవన్), డీజీహెచ్‌ఎస్ (న్యూఢిల్లీ)కు గురువారం రాం మనోహర్ లోహియా (ఆర్‌ఎంఎల్) ఆస్పత్రి డెరైక్టర్ నుంచి లేఖలు వెళ్లాయి. బాబు ఆరోగ్యం క్షీణించిందనే విషయం తప్ప, ఇతరత్రా వివరాలేవీ లేఖలో లేవు. అయితే శుక్రవారం బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆర్‌ఎంఎల్ నుంచి కేంద్రానికి వెళ్లిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘నిరవధిక దీక్షలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు శుక్రవారం ఉదయం 10.19 గంటలకు ఆర్‌ఎంఎల్ ఆసుపత్రి వైద్యులు దీక్ష శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన ప్రాథమిక ఆరోగ్య నివేదిక (ఓపీడీ రిజిస్ట్రేషన్ నంబరు 20130711950) ప్రకారం.. చంద్రబాబు ఏడవ తేదీ నుంచి దీక్షలో ఉన్నారు.
 
 ఆయనకు వికారం, వాంతులు, తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్లు బైర్లు కమ్మడం, చెమట పట్టడం, ఆందోళనగా ఉండడం వంటి సమస్యలేవీ లేవు. పల్స్ రేటు నిమిషానికి 82గా ఉంది. ఇది సాధారణం, మంచి పరిమాణం (గుడ్ వాల్యూమ్). రెస్పిరేటరీ రేటు సాధారణంగా ఉంది. రక్తపోటు 140/80. గ్లూకో మీటర్‌తో పరీక్షించగా బ్లడ్‌షుగర్ 83 ఎంజీగా ఉంది..’ ఇదీ ఆ నివేదిక సారాంశం. వాస్తవానికి చంద్రబాబు దీక్ష ప్రారంభించిన తర్వాత మూడోరోజైన బుధవారం నాడు సుగర్ లెవల్స్ 75 ఎంజీగా ఉన్నట్లు టీడీపీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. గురువారం సాయంత్రానికి చక్కెర స్థాయి 79 ఎంజీగా నమోదైందని చెప్పారు. తాజాగా శుక్రవారం ఆర్‌ఎంఎల్ వైద్యులు పరీక్షలు జరపగా చక్కెర స్థాయి 83 ఎంజీగా నమోదు అయ్యింది. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు మొత్తం నాలుగురోజులు దీక్ష చేశారు. సుగర్ లెవల్స్ నానాటికీ తగ్గుతూ శుక్రవారానికి బాగా పడిపోవాల్సి ఉండగా రోజురోజుకూ పెరగడం వెనుక రహస్యం ఏమిటని ఢిల్లీలోని దేశం నాయకుడొకరు విస్మయం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement