
పరీకర్ (పాతచిత్రం)
సీఎం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు రోజూవారీ వైద్యం అందుతోంది’ అని సీఎంవో వెల్లడించింది.
న్యూఢిల్లీ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ కోలుకుంటున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం శనివారం తెలిపింది. ఆయన ఆరోగ్యంపై రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజా ప్రకటనతో బీజేపీ శ్రేణులకు ఊరట లభించినట్లయింది. ‘సీఎం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు రోజూవారీ వైద్యం అందుతోంది’ అని సీఎంవో వెల్లడించింది. కాగా, మార్చి 4న గోవా మంత్రి విజయ్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపాయి. ‘పరీకర్ అడ్వాన్స్డ్ కాన్సర్‌తో బాధపడుతున్నారు. అయిన్పటికీ ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు’ అని చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో పాటు పాంక్రియాటిక్ కాన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ బాగా నీరసించిపోయి ప్రభుత్వ కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు వెలువడ్డాయి.