![China Is Powerful But India Not A Weak Nation Says Bipin Rawat - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/12/bipin-rawat_650x400_41515746199.jpg.webp?itok=7x0GHgDq)
సాక్షి, న్యూఢిల్లీ: తన భూభాగంలో దురాక్రమణకు దిగితే భారత్ సహించబోదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా బలమైన దేశం అయితే అవ్వొచ్చుకానీ, భారత్ బలహీనమైన దేశం కాదని ఆయన తేల్చిచెప్పారు. భారత్ తూర్పు సరిహద్దులపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. తూర్పు సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న సరిహద్దు ఉల్లంఘనలను ఎదుర్కొనే సత్తా దేశానికి ఉందన్నారు.
చైనా ఇటీవల భారత సరిహద్దుల్లో కార్యకలాపాలు పెంచి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మన ప్రాంతంలో చైనా మన ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకుంటూ భారత పొరుగు దేశాలను మచ్చిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, భారత తన పొరుగు దేశాలను దూరం చేసుకోబోదని, చైనాకు అవి దగ్గర కాకుండా చూసుకుంటున్నదని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment