అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు: వెంకయ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో జరిగిన అవినీతిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
కొత్తగా ఎంపికైన కేంద్ర మంత్రులు నివాసం ఉండేందుకు మాజీ కేంద్రమంత్రులు తమ నివాసాలు ఖాళీ చేయాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు.
జూలై రెండో వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని వెంకయ్య ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరుగుతుందని వెంకయ్యనాయుడు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.