సాక్షి,న్యూఢిల్లీ : భీమా- కొరేగావ్ ఘర్షణలతో అట్టుడుకుతున్న మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ శక్తులు హింసను ప్రేరేపిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఘర్షణలపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున కర్గే ఈ అంశాన్నిలేవనెత్తారు. మహారాష్ట్రలో హింస ప్రజ్వరిల్లినా ప్రధాని మౌనంగా ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
మహా అల్లర్ల వెనుక ఆర్‌ఎస్‌ఎస్ సహా హిందుత్వ శక్తులున్నాయని, మహారాష్ట్రలో దళితులు, మరాఠాల మధ్య చిచ్చు పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఆయన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం చెబుతుండటంతో ఆగ్రహించిన కర్గే తన చేతిలోని పత్రాలను చించివేశారు. దళితులకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ నిత్యం మౌనం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో దళితులపై హింసాకాండ సాగిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment