సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు పక్రియ శరవేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ , బీజీపీలకు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ ఎన్నికల పోరులో పోటీ హోరా హోరీగా సాగుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాల సరళి కనిపిస్తోంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు నియోజవర్గాల్లో వెనుకంజగా ఉండండం ఆరంభంలో కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనలో పడేసింది. అయితే క్రమంగా పుంజుకుంటున్న ధోరణి కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బాదామిలో సిద్ధరామయ్య శ్రీరాములుపై ఆధిక్యంలోకి వచ్చేశారు. ఆరంభంలో బాదామి, చాముండేశ్వరి రెండు నియోజకవర్గాల్లో ఆయన వెనుకబడి వున్నారు. రామ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కుమారస్వామి ఆధిక్యంలో ఉన్నారు.
ప్రస్తుత సరళిని బట్టి కాంగ్రెస్ 78 స్థానాల్లో, బీజేపీ 78 స్థానాల్లో లీడింగ్ లోఉన్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపైమరింత ఉత్కంఠత నెలకొంది. అటు జేడీఎస్ 27 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక దేవనాగరి (ఉత్తర) నియోజకవర్గంలో మల్లికార్జున ఖర్గే కుమారుడు, కనకపురాలో డీకే శివకుమార్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment