కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఏఐసీసీలో కీలక మార్పులు కొనసాగిస్తున్నారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలు మార్పులు చేపట్టారు. వివిధ రాష్ట్రాలకు పార్టీ బాధ్యులు,ఏఐసీసీ కార్యదర్శుల నియామకం చేపట్టారు. తాజా నియామకాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.
జేడీ శీలం, సంపత్‌లకు చోటు
మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంను ఏఐసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్‌కు అనుసంధానిస్తూ నియమించారు. ఏపీకి తమిళనాడుకు చెందిన క్రిస్టోఫర్ తిలక్, సీడీ మయ్యప్పన్‌లను ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. తెలంగాణకు చెందిన సంపత్ కుమార్‌ను ఏఐసీసీ కార్యదర్శిగా, మహారాష్ట్రకు ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శిగా శశికాంత్ శర్మ, కార్యదర్శిగా మహేంద్ర జోషీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను నియమించారు. ఖర్గేకు మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర ఏఐసీసీ కార్యదర్శులుగా సోనల్ పటేల్, అశోక్ దువా నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment