
కాంగ్రెస్‌లో వ్యవస్థాగత మార్పులు రావాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో నిర్మాణాత్మక, వ్యవస్థాగత మార్పులు అవసరమని ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు చెబుతున్నారు.
అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ ఫలితాలు మరీ తీసికట్టుగా లేవని, ఓటర్లను వర్గాల వారీగా చీల్చడం వల్లే బీజేపీ గెలిచిందని రాహుల్ మంగళవారం విలేకర్లతో అన్నారు. పార్టీలో కొత్త శక్తిని నింపాలని, భారీ శస్త్రచికిత్స అవసరమని మొయిలీ పేర్కొన్నారు.