ఇటీవల 'పనామా' వివాదంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తన్న ప్రతిపక్ష కాంగ్రెస్ కు అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ కేసును నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని అన్నారు. వివరాలు బయటికి వచ్చిన తర్వాత కాంగ్రేస్ పార్టీకి సంబరాలు చేసుకోవడానికి ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు.
కోల్కతాలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడుతూ... కేసు విచారణలో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారనే కాంగ్రెస్ వాదనను ఖండించారు. ఇది అర్థంలేని ఆరోపణ అని కొట్టి పారేశారు. పనామా వివాదంపై బహుముఖ విచారణ జరుగుతోందని, దోషులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఆదాయపన్ను ఎగ్గొడుతున్న వారి సంఖ్య దేశంలో ఎక్కువగానే ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.