ఉమ్మడి సమ్మతితో శృంగారం రేప్ కాదు! | Consensual physical relations do not amount to rape, says Bombay High Court | Sakshi
Sakshi News home page

ఉమ్మడి సమ్మతితో శృంగారం రేప్ కాదు!

Published Thu, Mar 10 2016 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

ఉమ్మడి సమ్మతితో శృంగారం రేప్ కాదు!

ఉమ్మడి సమ్మతితో శృంగారం రేప్ కాదు!

ముంబై: తన భాగస్వామితో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల తలెత్తే పరిణామాల గురించి విద్యావంతురాలైన ఒక మహిళకు పూర్తి అవగాహన ఉంటుందని, అలాంటి కేసులు అత్యాచారం పరిధిలోకి రావని బొంబాయి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మహిళతో సంబంధం పెట్టుకున్న ఓ 25 ఏళ్ల యువకుడికి  బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

షోలాపూర్‌కు చెందిన యువకుడి ముందస్తు బెయిల్‌ కేసులో జస్టిస్‌ మృదుల భట్‌కర్‌ గురువారం వాదనలు విన్నారు. తాను 24 ఏళ్ల యువతితో కొంతకాలం అనుబంధం కొనసాగించానని, ఆమెతో విడిపోగానే.. గత ఏడాది అక్టోబర్‌లో రేప్, చీటింగ్, నేరపూరిత ఉద్దేశం అభియోగాలతో తనపై కేసు నమోదు చేసిందని యువకుడు కోర్టుకు తెలిపాడు. ప్రతివాది అయిన మహిళ తరపున లాయర్ అనికేత్ నికమ్ వాదనలు వినిపిస్తూ.. 2015 మార్చిలో ఈ జంట తొలిసారి కలిసిందని, వెంటనే  ఇద్దరు ప్రేమలో పడ్డారని కోర్టుకు నివేదించారు. 'పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు హామీలతో అతను ఆమెతో బలవంతంగా శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. దీంతో 2015లో ఆమె గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకున్నాడు' అని నికమ్‌ కోర్టుకు తెలిపారు.

అయితే కోర్టు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో ఉమ్మడి సమ్మతితోనే జరిగిందని భావిస్తూ.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరముందని న్యాయమూర్తి పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ పాశ్చాత్య సంస్కృతి ప్రకారం దీనిని ఉమ్మడి సమ్మతిగానే పరిగణించాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement