physical relation
-
Indonesia: వివాహానికి ముందే శృంగారమా? అయితే..
జకార్తా: చాలా దేశాల్లో డేటింగ్, పెళ్లికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం లాంటి వ్యవహారాలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. అయితే.. ఇస్లాం దేశమైన ఇండోనేషియా.. అలాంటివి సహించడం కుదరని అంటోంది. వివాహానికి ముందే శృంగారాన్ని నేరంగా పరిగణించాలని నిర్ణయించుకుంది. తాజాగా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్‌ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంటే శిక్షించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ క్రిమినల్ కోడ్‌ను త్వరలో జరగోబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతుందట. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నా.. లేకుంటే వివాహేతర సంబంధం కొనసాగించినా?.. ఏడాదిపాటు కారాగార శిక్ష విధించాలని, అదే విధంగా జరిమానా కూడా విధించాలని సదరు డ్రాఫ్ట్ పేర్కొంది. అయితే.. ఇది అమలు కావాలంటే ఒకటి వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదంటే బాధిత భర్త.. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. అలాగే.. వివాహం కాకముందు శృంగారంలో గనుక పాల్గొంటే.. వాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టికల్ 144 ప్రకారం.. కోర్టులో విచారణ ప్రారంభం కాకముందు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాస్తవానికి ఈ డ్రాఫ్ట్ వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ప్రజావ్యతిరేకతతో ఇంతకాలం ఇది అమలుకు నోచుకోలేదు. ప్రపంచంలోనే అత్యధిక ఇస్లాం జనాభా ఉన్న ఇండోనేషియాలో.. మహిళలను, మైనారిటీలను, ఎల్జీబీటీక్యూలను అణగదొక్కేందుకు వందల సంఖ్యలో నియంత్రణ చట్టాలు అమలు అవుతున్నాయి. ఇక కొత్తగా రాబోయే క్రిమినల్ కోడ్.. ఇండోనేషియా ప్రజలతో పాటు విదేశీయులకు కూడా వర్తించనుంది. అయితే ఇది టూరిజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఉమ్మడి సమ్మతితో శృంగారం రేప్ కాదు!
ముంబై: తన భాగస్వామితో శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం వల్ల తలెత్తే పరిణామాల గురించి విద్యావంతురాలైన ఒక మహిళకు పూర్తి అవగాహన ఉంటుందని, అలాంటి కేసులు అత్యాచారం పరిధిలోకి రావని బొంబాయి హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. మహిళతో సంబంధం పెట్టుకున్న ఓ 25 ఏళ్ల యువకుడికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. షోలాపూర్‌కు చెందిన యువకుడి ముందస్తు బెయిల్ కేసులో జస్టిస్ మృదుల భట్కర్ గురువారం వాదనలు విన్నారు. తాను 24 ఏళ్ల యువతితో కొంతకాలం అనుబంధం కొనసాగించానని, ఆమెతో విడిపోగానే.. గత ఏడాది అక్టోబర్‌లో రేప్, చీటింగ్, నేరపూరిత ఉద్దేశం అభియోగాలతో తనపై కేసు నమోదు చేసిందని యువకుడు కోర్టుకు తెలిపాడు. ప్రతివాది అయిన మహిళ తరపున లాయర్ అనికేత్ నికమ్ వాదనలు వినిపిస్తూ.. 2015 మార్చిలో ఈ జంట తొలిసారి కలిసిందని, వెంటనే ఇద్దరు ప్రేమలో పడ్డారని కోర్టుకు నివేదించారు. 'పెళ్లి చేసుకుంటాననే అబద్ధపు హామీలతో అతను ఆమెతో బలవంతంగా శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు. దీంతో 2015లో ఆమె గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకున్నాడు' అని నికమ్ కోర్టుకు తెలిపారు. అయితే కోర్టు మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో ఉమ్మడి సమ్మతితోనే జరిగిందని భావిస్తూ.. ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిన అవసరముందని న్యాయమూర్తి పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ పాశ్చాత్య సంస్కృతి ప్రకారం దీనిని ఉమ్మడి సమ్మతిగానే పరిగణించాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.