మహిళలపై ఖాకీల జులుం
దౌసా: దేవుడి దర్శనం కోసం గుడికి వచ్చిన భక్తులపై పోలీసులు సామాన్యులపై ప్రతాపం చూపించారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాజస్థాన్ లోని దౌసా జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెహందీపూర్ ఆలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
హోలీ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులపై ఖాకీలు అమానవీయంగా ప్రవర్తించారు. మహిళల పట్ల నలుగురు పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. వారిని పక్కకు తోసేసి దౌర్జన్యం చేశారు. అదేమని అడిగిన పురుషులపై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల దౌర్జన్యంపై భక్తులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.