
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 52,952 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 15,266 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 1783 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : త్వరలో ప్రజా రవాణాకు పచ్చజెండా)
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 29 వేల కరోనా కేసులు ఈ మూడు చోట్లనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదు కాగా, 651 మంది మృతిచెందారు. మరోనా వైపు కేరళలో మాత్రం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేరళలో 503 కరోనా కేసులు నమోదుకగా, 469 మంది కోలుకున్నారు. నలుగురు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment