న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అతి వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం కరోనా కేసుల సంఖ్య 5.48 లక్షల మార్కును చేరుకుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 1,70,560 టెస్టులు చేయగా 19,459 కొత్త కేసులు బయటపడ్డాయి. ఒక్క రోజులోనే 380 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద 16,475 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 83,98,362 మందికి కరోనా టెస్టులు చేశారు.
దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318గా నమోదైంది. వీటిలో 3,21,722 మంది జబ్బు నుంచి కోలుకోగా, 2,10,120 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది. (రికవరీ రేటు 58.56 శాతం)
Comments
Please login to add a commentAdd a comment