
బెంగళూరు : కర్ణాటకలో ఒక కరోనా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిలక్‌నగర్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి శ్వాసకోస సంబంధ వ్యాది, హై ఫీవర్‌తో బాధపడుతూ ఏప్రిల్ 24న బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేరాడు. ఆ వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాటు ఆ వ్యక్తి కాలేయం, మూత్ర పిండాల సమస్యతో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతుండడంతో క్రమం తప్పకుండా డయాలసిస్ కూడా నిర్వహిస్తున్నారు. (బ్రిటన్ చిన్నారుల్లో కొత్త లక్షణాలు)
ఈ క్రమంలోనే సోమవారం ఉదయం డాక్టర్లు ఐసీయులో పేషెంట్లను చూస్తుండడంతో ఇదే సరైన సమయమని భావించిన బాధితుడు తనకు కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డుకు టిఫిన్ తెమ్మని చెప్పాడు. అతను వెళ్లగానే అత్యవసర మార్గం ఉపయోగించి భవనం ఆరో అంతస్తుకు చేరుకొని అక్కడి నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉండడంతో నిబంధనల ప్రకారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, కొన్ని వారాల క్రితం దుబాయ్ నుంచి తిరిగివచ్చినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.
('సిక్స్ కొడితే ఆ బంతిని బ్యాట్స్‌మన్ తెచ్చుకోవాలి')
Comments
Please login to add a commentAdd a comment