న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రోజులు గడుస్తున్న కొద్ది కేసులు తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దేశంలో కరోనా కేసులు పది లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి ఇంత అధిక మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,70,169కు చేరింది. బుధవారం రోజు 606 మరణాలు సంభవించగా ఇప్పటి వరకు 24, 929 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. (ఒకేరోజు 3.2 లక్షల కోవిడ్ పరీక్షలు)
కాగా 36,15,991 కేసులతో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 19,70,909 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. భారత్ మూడు స్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 2,75,640 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో 1,16,993 మంది కరోనా బారిన పడ్డారు. ఇక తమిళనాడులో ఈ సంఖ్య 1,50,001గా ఉంది. (కరోనా: అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు)
Comments
Please login to add a commentAdd a comment