న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు 50 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52,509 వేల కేసులు వెలుగు చూడగా ఒక్క రోజే 857 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 19,08,255 మంది కరోనా బారిన పడగా, మంగళవారం నాటికి 39,795 మరణాలు సంభవించాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. (తెలంగాణలో 70వేలు దాటిన కరోనా కేసులు)
ప్రస్తుతం 5,86,244 యాక్టీవ్ కేసులు ఉండగా, దేశవ్యాప్తంగా 12,82,216 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 66.30 శాతంగా ఉంది. కాగా 4,57,956 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2,68,285 పాజిటివ్ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ 1,76,333 కేసులతో మూడో స్థానంలో ఉంది. ఇక కర్ణాటకలో 1,45,830 మందికి కరోనా సోకగా.. ఢిల్లీలో 1,39,156 మంది వైరస్ బారిన పడ్డారు. (ఏపీలో 64,147 పరీక్షలు)
Comments
Please login to add a commentAdd a comment