న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు దేశంలో 60 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే(శుక్రవారం) 933 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 20,88,612కు చేరింది. మొత్తం 42,518 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో 6,88,612 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,006 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. (కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధిలో అరబిందో )
ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం రోజు 5,98,778 కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 2,33,87,171 టెస్టులు పూర్తి చేశారు. కాగా పశ్చిమ బెంగాల్ కేసుల తీవ్రత అధికమవుతుండటంతో ఈ నెల 20,21,27,28,31 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించేందుకు బెంగాల్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,74,318 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,523,841కు చేరింది. వీరిలో 12,533,535 కోలుకొగా.. 7,22,952 మంది చనిపోయారు. (తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు)
#WestBengal : Shops closed in Siliguri today due to #COVID19 lockdown.
— ANI (@ANI) August 8, 2020
Complete lockdown to be observed in the state on August 20, 21, 27, 28 & 31 also. pic.twitter.com/ChO47bJysh
Comments
Please login to add a commentAdd a comment