సాక్షి న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చేవారు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న మూడు హోటళ్లలో క్వారంటైన్ సదుపాయాలను ఖరీదు చెల్లించి పొందడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. లెమన్‌ట్రీ, రెడ్ ఫాక్స్, ఐబీఐఎస్ హోటళ్లలో 182 గదులను ఇందుకోసం అందుబాటులో ఉంచారు. ఆసుపత్రులలో లభించే క్వారంటైన్ సదుపాయాలు నచ్చనివారు ఈ హోటళ్లలో గదులను సెల్ఫ్ క్వారంటైన్ కోసం ఉపయోగించుకోవచ్చు. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే )
క్వారంటైన్ సేవలు ఇలా..
కరోనా కేసులు పెరుగుతుండడంతో ఢిల్లీలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. ప్రభుత్వం హోటల్ యాజమాన్యాలతో ఈ విషయాన్ని చర్చించి వాటిని విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ కోసం ఉపయోగించాలనే ఆదేశం జారీ చేసింది. ఢిల్లీí ఎడెమిక డిసీజ్ కోవిడ్–19 నిబంధనలు 2020 కింద ప్రభుత్వం ఈ రూముల అద్దెకు, వాటి మెయింటెనెన్స్‌కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది. (జాగ్రత్త పడకపోతే.. వినాశనమే)
- ఐబీఐఎస్ హోటల్‌లో 92 గదులను, లెమన్‌ట్రీ ప్రీమియర్ హోటల్లో 54 గదులను, రెడ్‌ఫాక్స్ హోటల్లో 36 గదులను క్వారంటైన్ కోసం కేటాయించారు.
- ఈ క్వారంటైన్ గదుల్లో బస చేసేవారు రోజుకు రూ.3100 అద్దె చెల్లించవలసి ఉంటుంది.
- ఈ గదుల్లో బస చేసేవారికి ఉదయం అల్పాహారం, రెండు పూటలా భోజనం, టీ, కాఫీలతో పాటు రోజుకు రెండు బాటిళ్ల మినరల్ వాటర్‌ను అందజేస్తారు.
- భోజనాన్ని వారి గదులలోనే డిస్పోజబుల్ ప్లేట్లు/పాత్రలలో అందిస్తారు.
- వాడిన డిస్పోజబుల్ ప్లేట్లు/పాత్రలను బయోమెడికల్ వ్యర్థాల కింద ప్రొటోకాల్ ప్రకారం నిర్మూలిస్తారు.
- గదులలో వైఫై సదుపాయం, టీవీ ఉంటాయి.
- ఈ గదులలో వాడే లాండ్రీని మిగతా గదుల లాండ్రీతో కలపకుండా జాగ్రత్త వహిస్తారు.
- ఈ హోటళ్లలో బస చేసిన వారు నిర్దేశించిన పరిసరాలకు మాత్రమే పరిమితమై ఉండేలా భద్రతా సిబ్బంది చూస్తారు.
- గదులలో ఉండేవారి కదలికలను హోటల్ యాజమాన్యం సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూము నుంచి గమనిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment