
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 8 వేలు దాటింది. లాక్‌డౌన్ కట్టుదిట్టంగా కొనసాగుతున్న కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 909 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆలాగే మరో 34 మంది మరణించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌లతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8356కు చేరుకుంది. ఇందులో ఇప్పటివరకు 716ని డిశ్చార్జ్ చేయగా.. 273 మంది చనిపోయారు. ప్రసుత్తం 7367 కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చదవండి:
కరోనా: ఇటలీని దాటేసిన అగ్రరాజ్యం
ఏప్రిల్ 30 దాకా.. లాక్‌డౌన్ పొడిగింపు..
Comments
Please login to add a commentAdd a comment