తెలుగు రాష్ట్రాల్లో 8 జిల్లాలు లాక్‌డౌన్‌ | Coronavirus: Indian Govt Decides To Lockdown 75 Districts | Sakshi
Sakshi News home page

కరోనా ఎఫెక్ట్‌ : 75 జిల్లాల్లో లాక్‌డౌన్‌

Published Sun, Mar 22 2020 6:05 PM | Last Updated on Sun, Mar 22 2020 6:34 PM

Coronavirus: Indian Govt Decides To Lockdown 75 Districts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనావైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు, తెలంగాణ నుంచి 5 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో ప్రకాశం, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలను లాక్‌డౌన్‌ చేసింది. అటు తెలంగాణలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, భద్రాద్రి జిల్లాలను లాక్‌డౌన్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కర్ణాటకలో 4 జిల్లాలు, తమిళనాడులో చెన్నై సహా రెండు జిల్లాలు, ఢిల్లీలో 7, ఉత్తరప్రదేశ్‌లో 15 జిల్లాలలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. మార్చి 31 వరకు ఇది అమల్లో ఉండనుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు గూడ్స్ మినహా అన్ని రైళ్లను రద్దుచేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. 

కాగా, భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ఆదివారం నాటికి ఏడుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఈ మహమ్మారి బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మహరాష్ట్ర, బిహార్‌, గుజరాత్‌లో ఈ మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య 300 దాటింది.

లాక్‌డౌన్‌ చేసిన జిల్లాల వివరాల కోసం క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement