
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ ప్రకటించి నెలరోజులు కావస్తున్నా కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకు పెద్ద మొత్తంలో కొత్త కరోనా కేసులు నమోదవుతుండటం అందరినీ ఆందళోనకు గురిచేస్తోంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 15,000 దాటింది. గత 24 గంటల్లో 1334 మందికి పాజిటివ్‌గా తేలడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,712కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా 507 మంది మృతి చెందగా.. 2,230 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 12,794 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 3,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా 211 మంది మరణించారు. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ (1,893), మధ్యప్రదేశ్(1,402), రాజస్తాన్ (1,395) రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి:
21 రోజుల తర్వాత ఆత్మీయ కలయిక..
దేవుడా! వైద్యులకే కరోనా వస్తే..
Comments
Please login to add a commentAdd a comment