
సాక్షి, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కోవిడ్-19(కరోనా వైరస్) కలకలం రేగింది. యూఎస్ ఎంబసీ అధికారికి కరోనా పరీక్షలు నిర్వహించగా శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో భారత వైద్యాధికారుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందిస్తున్నట్లు ఆ కార్యాలయ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కరోనా సోకిన వ్యక్తి భారతీయుడా, అమెరికా సంతతి పౌరుడా అన్న విషయాన్ని వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అయితే తమ కార్యాలయంలో పని చేసే అమెరికా పౌరులైనా, స్థానిక వ్యక్తులైనా వారి రక్షణే తమ ముందున్న ప్రధాన బాధ్యతగా అభివర్ణించారు. మరోవైపు అధికారులు అతనితో సన్నిహితంగా మెదిలిన వ్యక్తుల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. ఢిల్లీలో ఇప్పటివరకు 219 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు వ్యక్తులు మరణించారు. (శాంతా, ఎట్లున్నవ్? తింటున్నవా?)