సాక్షి, న్యూఢిల్లీ : సర్కార్ ఖజానాకు చేరే ప్రతి రూపాయిలో 68 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుంచే జమవుతున్నాయి. ఇక ప్రభుత్వ వ్యయంలో సింహభాగం అంటే 23 శాతం పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద ఆయా రాష్ట్రాలకు కేంద్రం చెల్లిస్తోంది. బడ్జెట్ గణాంకాల ప్రకారం ప్రభుత్వానికి సమకూరే ప్రతి రూపాయి రాబడిలో జీఎస్టీ నుంచి వచ్చే ఆదాయం 19 పైసలుగా ఉంది.
ప్రతి రూపాయిలో అత్యధికంగా కార్పొరేషన్ పన్ను వాటా 21 పైసలుగా ఉండటం గమనార్హం. మరోవైపు రుణాలు, ఇతర మార్గాల్లో సమీకరించే రాబడి ప్రతి రూపాయిలో 20 పైసలు కాగా, వసూలయ్యే ప్రతి రూపాయిలో ఆదాయ పన్ను వాటా 16 పైసలుగా ఉంది.
ఇక పెట్టుబడుల ఉపసంహరణ వంటి పన్నేతర రాబడుల నుంచి ప్రతి రూపాయిలో 9 పైసలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాగా ప్రభుత్వానికి సమకూరే ప్రతి రూపాయిలో 8 శాతం ఎక్సైజ్ సుంకం, 4 పైసలు కస్టమ్స్ సుంకం, మూడు పైసలు రుణేతర పెట్టుబడి వసూళ్ల నుంచి ప్రభుత్వం రాబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment