‘ధిక్కార’ తీర్పులు హుందాగా ఉండాలి | Courts to exercise contempt to uphold majesty of judiciary: SC | Sakshi
Sakshi News home page

‘ధిక్కార’ తీర్పులు హుందాగా ఉండాలి

Published Thu, Nov 3 2016 1:33 PM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM

Courts to exercise contempt to uphold majesty of judiciary: SC

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార నేరం కింద నిందితులకు శిక్ష విధించేటపుడు కోర్టులు తగిన కసరత్తు చేయాలని, తీర్పులు కోర్టుల గౌరవాన్ని పెంచేవిగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించిందని.. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార తీర్పులను జాగ్రత్తగా, ఆచితూచి ఇవ్వాలని కోర్టులను ఆదేశించింది.

రాజస్తాన్‌ హైకోర్టు ధిక్కార నేరం కింద ఇచ్చిన తీర్పుకు సంబంధించి దాఖలైన అప్పీల్‌పై విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కార్మిక నేత హత్య కేసులో నిందితుడికి రాజస్తాన్‌ హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. దీనిపై సీపీఎం నేతలు పార్టీ సమావేశంలో కోర్టును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement