ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు | Creamy layer income cap for OBCs raised to Rs 8 lakh per annum | Sakshi
Sakshi News home page

ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు

Published Wed, Sep 13 2017 8:01 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు

ఓబీసీ ఆదాయ పరిమితి పెంపు

సాక్షి,న్యూఢిల్లీ: ఓబీసీ కోటా పొందేందుకు క్రీమిలేయర్‌ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 6లక్షల నుంచి రూ 8లక్షలకు పెంచారు. దీనిప్రకారం వరుసగా మూడేళ్ల పాటు రూ 8 లక్షలు అంతకుమించి వార్షికాదాయం ఉన్న తల్లితండ్రుల పిల్లలు క్రీమీలేయర్‌ కేటగిరీ పరిథిలోకి వస్తారు. ఇతర వెనుకబడిన తరగుతుల వారికి వర్తించే రిజర్వేషన్‌ ప్రయోజనాలు వీరికి వర్తించవు.
 
ఓబీసీల్లో క్రీమిలేయర్‌ పరిధిని నిర్ధారించేందుకు వార్షికాదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచినట్టు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. 1993లో రూ లక్షగా ఉన్న క్రీమిలేయర్‌ పరిమితిని 2004లో రూ 2.5 లక్షలకు, 2008లో రూ 4.5 లక్షలకు 2013లో రూ 6 లక్షలకు పెంచారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement