సాక్షి, చెన్నై/తిరువనంతపురం : ఓక్కి తుఫాన్ ధాటికి తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులకు ఇప్పటిదాకా 8 మంది (తమిళనాడు, కేరళలో నలుగురి చొప్పున) మృతి చెందినట్లు సమాచారం. శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబతున్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన సుమారు 80 మందికి పైగా జాడ ఇప్పటిదాకా తెలియరావటం లేదు.
పరిస్థితి దారుణంగా ఉండటంతో తమిళనాడులోని 7 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన అధికారులు.. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. సహాయక చర్యల కోసం నేవీ, ఎన్‌డీఆర్‌ఎప్‌లు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లాపై దీని ప్రభావం మరీదారుణంగా చూపిస్తోంది. ఎటు చూసినా కూలిన చెట్లు, విద్యుత్ స్థంబాలే దర్శనమిస్తున్నాయి. ఓక్కి మిగిల్చిన నష్టం భారీగానే ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరింత బలపడిన తుఫాన్ అరేబియా సముద్రం వైపుగా వెళ్తోంది. దీంతో రానున్న 24 గంటల్లో దక్షిణ తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇది కూడా చదవండి... ఓక్కి అంటే ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment