
దావూద్ వర్సస్ విక్కిశెట్టి
కర్ణాటకపై పట్టుకోసం ఇద్దరు మాఫియా డాన్‌లు పోరాడుతున్న తరుణంలో ఒకరి అనుచరులు దారుణ హత్యకు గురయ్యా రు.
మంగళూరు జైలులో ఖైదీలా బాహాబాహి
దావూద్ ఇబ్రహీం అనుచరుడితో మరొకరి మృతి
గాయపడ్డ పది మంది
కర్ణాటకపై పట్టుకోసం ఇద్దరు మాఫియా డాన్‌లు పోరాడుతున్న తరుణంలో ఒకరి అనుచరులు దారుణ హత్యకు గురయ్యా రు. ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి ఉద్దేశించిన జైల్లోనే ఈ ఘటన చోటుచేసు కోవడం గమనార్హం. వివరాలు... ఐటీ, రియల్ ఎస్టేట్ రంగానికి రాజధానిగా మారిన కర్ణాటక పై పట్టుకోసం దావూద్ ఇబ్రహీంతో సహా అనేక మంది మాఫియా డాన్‌లు ప్రయత్నిస్తున్నారు.
ఇందుకోసం ఎలాంటి దారుణానికైనా వారు తెగబడుతున్నారు. దావూద్ ఇబ్రహీంతో పాటు విక్కి శెట్టి ఈ విషయంలో ముందున్నారు. వ్యా పారులనే కాకుండా ఏకంగా మంత్రులనే బెదిరిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇవన్నీ జైళ్ల నుంచే జరుగుతుండడం గమనార్హం. సోమవారం ఉదయం జరిగిన తాజా సంఘటనే ఇందుకు ఉదాహరణ. దావూద్ అను చరుడిగా భావిస్తున్న మడూరు యూసఫ్, మంగళూరును అడ్డగా మార్చుకుని కిడ్నాప్‌లు, బె దిరింపులు, హత్యలకు పాల్పడేవాడు.
దావూద్ కు చెక్‌పెట్టి దేశంలో మరో దాదాగా ఎదిగేందుకు విక్కి శెట్టి సైతం తన అనుచరుడైన ఆకాష్ దావన్ శరణ్ ద్వారా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోమడూరు యూసఫ్ రిమాండ్ ఖైదీ గా ఉన్న మంగళూరు జైలుకే శరణ్ కూడా రిమాండ్ ఖైదీగా ఇటీవల చేరుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజులుగా వారి ఇద్దరి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
సోమవారం ఉదయం వీరిద్దరు తమ అనుచర ఖైదీల తో కలిసి పరస్పరం మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో మడూరు యూసఫ్‌తో పాటు అతని ఆప్తుడు, అదే జైలులో ఉన్న గణేష్ శెట్టి కూడా మృతి చెందాడు. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉన్న కారాగారాంలోకి డాగర్‌లు, కత్తుల వంటి ఆయుధాలు ఎలా వచ్చాయన్న విషయంపై పోలీసులు, జైలు శాఖ అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు.