
'ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయింది'
అలహాబాద్: అవినీతిని నిర్మూలించడానికి పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేత చర్య అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఉగ్రవాదులకు ఫండింగ్ ఆగిపోయిందని గురువారం ఉత్తర ప్రదేశ్‌లో మీడియాతో మాట్లాడుతూ మోదీ నిర్ణయాన్ని సమర్థించారు. అవినీతిపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి అని అమిత్ షా ప్రశ్నించారు.