ధనుష్ శతఘ్నికి ధ్రువీకరణ పరీక్షలు
న్యూఢిల్లీ: బోఫోర్స్ శతఘ్నిని ఆధునీకరించి భారత్ అభివృద్ధిపరుస్తున్న ‘ధను ష్’ శతఘ్ని అభివృద్ధి ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇదివరకే ప్రాథమిక పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఫిరంగి ప్రస్తుతం కీలకమైన ధ్రువీకరణ పరీక్షలు ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ధ్రువీకరణ పరీక్షల్లో కూడా సత్తా చాటితే ఇక స్వదేశీ శతఘు్నల ఉత్పత్తిని పెద్ద ఎత్తున చేపట్టేందుకు మార్గం సుగమం కానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఉత్పత్తికి ఆమోదం లభించాక సైన్యం తొలి దశలో 114 ధనుష్ శతఘు్నల తయారీ కోసం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు(ఓఎఫ్‌బీ)కు రూ. 1,200 కోట్ల ఆర్డర్‌ను ఇవ్వనుంది. ప్రస్తుత పరీక్షలకు ఉపయోగించే ధనుష్ శతఘు్నలను ఓఎఫ్‌బీకి చెందిన జబల్పూర్‌లోని గన్ క్యారియేజ్ ఫ్యాక్టరీ తయారు చేస్తోంది.